Share News

లింగాపూర్‌ సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:48 PM

అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్‌ గ్రామాన్ని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బట్టి వెంకటయ్య సోమవారం సందర్శిం చారు. లింగాపూర్‌లో లెదర్‌ పార్కు ఏర్పాటు కోసం నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

లింగాపూర్‌ సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

అంతర్గాం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్‌ గ్రామాన్ని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బట్టి వెంకటయ్య సోమవారం సందర్శిం చారు. లింగాపూర్‌లో లెదర్‌ పార్కు ఏర్పాటు కోసం నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలం సింగరేణి ముంపు ప్రాంతమైన ఎస్సీ కాలనీవాసులకు పునరా వాసం కోసం కేటాయించిన స్థలమని, దానిని లెదర్‌ పార్కు కోసం ఇవ్వవద్దని ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్థులు చైర్మన్‌ను వేడుకున్నారు. ఎస్సీ కాలనీవాసుల సమస్యలు విన్న చైర్మన్‌, వారికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. లెదర్‌పార్క్‌ కోసం వేరే చోట స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు తెలుపుతానని చైర్మన్‌ హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీకి సమీపంలోనే సింగరేణి మట్టికుప్పలు, చెట్ల పొదలు ఉండటంతో గృహాల్లోకి అడవిపందులు, పాములు వస్తున్నాయని, సింగరేణి యాజమాన్యం తమకు పునరా వాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందించారు. అనంతరం ప్రభుత్వ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రాంగణంలోగల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, వసతులు, సౌకర్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కళాశా లకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవా లని, తల్లితండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్డీఓ గంగయ్య, తహసీ ల్దార్‌ భూం రవీందర్‌, మాజీ సర్పంచ్‌ ఇరికిల్ల శంకరయ్య, నాయకులు రవి, కాసర్ల మల్లేష్‌లు వినతి పత్రం అందించారు. ప్రిన్సిపాల్‌ శారద, మాధవి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:48 PM