హెల్మెట్ ధరించిన మహిళలకు చీరల బహుమానం
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:32 AM
హెల్మెట్ ధర్మించి ద్విచక్ర వాహనం నడుపుతున్న మహిళలకు గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు గురువారం చీరలను బహూకరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): హెల్మెట్ ధర్మించి ద్విచక్ర వాహనం నడుపుతున్న మహిళలకు గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు గురువారం చీరలను బహూకరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత హెల్మెట్ ధరించకుండా ఇష్టానుసారంగా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా క్షతగాత్రులవుతున్నారన్నారు. కనీసం 10 నుంచి 20శాతమైనా ప్రమాదాలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, పిల్లలను పాఠశాలలకు తీసుకెళుతున్న గృహిణిలు బాధ్యతాయుతంగా హెల్మెట్లు ధరిస్తున్నారని, వారి చైతన్యం అభినందనీయమన్నారు. వారిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐ హరి శేఖర్ పాల్గొన్నారు.