Share News

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:27 AM

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయా లని, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర మైనింగ్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్వాగతం పలికారు. అనంతరం ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి, జిల్లెలపల్లి గ్రామాలలో ఉన్న ఇసుక రీచ్‌లను టీజీఎండీసీ వైస్‌ చైర్మన్‌ బీఆర్‌వీ సుశీల్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.

 ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి

ముత్తారం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయా లని, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర మైనింగ్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్వాగతం పలికారు. అనంతరం ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి, జిల్లెలపల్లి గ్రామాలలో ఉన్న ఇసుక రీచ్‌లను టీజీఎండీసీ వైస్‌ చైర్మన్‌ బీఆర్‌వీ సుశీల్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. మైనింగ్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడు తూ ఇసుక అక్రమ రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల న్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఇసుక రీచ్‌ వద్ద 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని, డిస్పాచ్‌ సెం టర్‌లను పెంచాలని అన్నారు. 360 డిగ్రీల కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్‌ యార్డుల వద్ద ఫెన్సింగ్‌తో పాటు ఒకే ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికా రులను నియమించాలని, బ్లాక్‌ మార్కెట్‌ అరి కట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉం డేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ జిల్లెలపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలను తనిఖీ చేసి పాఠ్యాంశాలను బోధించారు. మంథని ఆర్డీవో సురేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మైనింగ్‌ శ్రీనివాస్‌, తహసిల్దార్‌ మధుసూదన్‌రెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:27 AM