Share News

రామగుండంలో ఇసుక డంప్‌లు సీజ్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:36 AM

రామగుం డం ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయమై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఇసుక మాఫియా కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదలింది. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో తహసీల్దార్‌లను ఇసుక డంప్‌ లను సీజ్‌ చేయాలని ఆదేశించారు.

రామగుండంలో ఇసుక డంప్‌లు సీజ్‌

కోల్‌సిటీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రామగుం డం ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయమై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఇసుక మాఫియా కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదలింది. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో తహసీల్దార్‌లను ఇసుక డంప్‌ లను సీజ్‌ చేయాలని ఆదేశించారు. రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ ఝా అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకున్నారు. పోలీస్‌ అధికారులు రెవెన్యూ, మైనింగ్‌తో కలిసి తనిఖీలు జరుపాలని ఆదేశించారు. దీంతో గోదా వరిఖని ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు జరిపారు. గోదావరిఖని సప్తగిరికాలనీ, ఎఫ్‌సీఐ సంజయ్‌గాంధీనగర్‌, జనగామలోని ఇసుక డంప్‌లను సీజ్‌ చేసినట్టు తహసీల్దార్‌ శ్రీపాద ఈశ్వర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని సప్తగిరికాలనీలోని ఒక ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో నిల్వ ఉన్న 130ట్రిప్పుల ఇసుక డం ప్‌ను సీజ్‌ చేసినట్టు వన్‌ టౌన్‌ ఇన్‌స్పె క్టర్‌ ఇంద్రసేనా రెడ్డి పేర్కొ న్నారు. సీఐ మాట్లాడుతూ ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుక ునేలా వెసలుబాటు కల్పిస్తే కొందరు అక్రమంగా తరలిస్తు న్నారని, ఇది చట్టరీత్యా నేర మని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఐ సంపత్‌, జూనియర్‌ అసి స్టెంట్‌ శ్రీనివాస్‌, మైనింగ్‌ ఆర్‌ఐ గిరి, ఎన్‌టీ పీసీ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, టుటౌన్‌ పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:36 AM