Share News

సబ్బితం జలపాతాన్ని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:25 PM

సబ్బితం జలపాతాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించా నని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఫారెస్ట్‌ అధికారుల నివాస గృహ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు.

 సబ్బితం జలపాతాన్ని అభివృద్ధి చేస్తా

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : సబ్బితం జలపాతాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించా నని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఫారెస్ట్‌ అధికారుల నివాస గృహ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించి ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలన్నారు.

గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా కోతలు విధించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గింజ కటింగ్‌ లేకుండా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. సబ్బితం జలపాతం అభివృద్ధికి రూ.6 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, జిల్లా ఫారెస్ట్‌ అధికారి శివయ్య, వ్యవసాయ మార్కె ట్‌ చైర్‌ పర్సన్‌ ఈర్ల స్వరూప, ప్రకాష్‌రావు, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌, గ్రామ ప్రత్యేకాఽధికారి రాజ్యలక్ష్మీ, కార్యదర్శి అప్జల్‌ పాష, పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 11:25 PM