Share News

హిందు సమాజం ఐక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:37 PM

హిందు సమాజాన్ని ఐక్యత చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కృషి చేస్తుందని కరీంనగర్‌ విభాగ్‌ సద్బావన్‌ ప్రముఖ్‌ కొండేటి బాలరాజు, సహ కార్యవాక్‌ కొంపెల్లి రాజన్న అన్నారు. ఆదివారం గోదావరిఖనిలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పథ సంచాలన కార్యక్రమం సందర్భంగా సమరోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హిందు సమాజం ఐక్యతకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): హిందు సమాజాన్ని ఐక్యత చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కృషి చేస్తుందని కరీంనగర్‌ విభాగ్‌ సద్బావన్‌ ప్రముఖ్‌ కొండేటి బాలరాజు, సహ కార్యవాక్‌ కొంపెల్లి రాజన్న అన్నారు. ఆదివారం గోదావరిఖనిలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పథ సంచాలన కార్యక్రమం సందర్భంగా సమరోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తీసుకున్న వ్యక్తి నిర్మాణంలో భాగంగా దేశ నిర్మాణం, దేశ పూర్వవైభవ స్థితికి రావాలని, హిందు సమాజాన్ని జాగృతి పరచడం, వ్యక్తి నిర్మాణం కోసం రోజువారీ శాఖ నిర్వహణ, సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధం తీసుకుని సమాజంలో అఖండత వైపు పరిపూర్ణ హిందు సంఘటితానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని చెప్పారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాలు 2026వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అనంతరం కరసేవకులు సమరోక్‌ కార్యక్రమాన్ని పుర వీధుల నుంచి నిర్వహించగా మహిళలు పూలతో స్వాగతం పలికారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి గాంధీనగర్‌, లేబర్‌ కోర్టు, చౌరస్తా, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, స్వతంత్రచౌక్‌, మార్కండేయకాలనీ మీదుగా ర్యాలీ సాగింది. నగర కార్యవాహక్‌ పైడిపెల్లి రాంమూర్తి, మంథెన శ్రీనివాస్‌, మధుకర్‌తో పాటు వివిధ విభాగాల కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశ రక్షణే స్వయం సేవకుల లక్ష్యం

మంథని, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణే స్వయం సేవకుల తొలి లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్‌ కరీంనగర్‌ విభాగ్‌ సహ వ్యవస్థ ప్రముఖ్‌ దావులూరి మురళీధర్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వయం సేవకులు మంథని పట్టణ పురవీధుల్లో ఆదివారం పథ సంచాలన్‌ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్‌లో జరిగిన సభలో మురళీధర్‌ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ వంద సంవత్సరాలుగా శాఖ పద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. దేశ రక్షణ కోసం స్వయం సేవకులు నిరంతరం కృషి చేస్తారన్నారు. గర్రెపల్లి వెంకటేశ్వర్లు, మాడిశెట్టి సుదర్శన్‌, సురేందర్‌, లింగం శంకర్‌, నాంపెల్లి రమేష్‌, పుట్ట సదయ్య, కనుకుంట్ల స్వామి, మేడగోని రాజమౌళిగౌడ్‌, పెండ్యాల లిఖిత్‌, అకుల సాగర్‌, తూర్పాటి రాము, రావుల సతీష్‌, నరేండ్ల రాజేష్‌, అధిక సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:37 PM