Share News

మానేరుపై హైలెవల్‌ బ్రిడ్జికి రూ. 203 కోట్లు

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:14 AM

మంథని మండలంలోని ఆరెంద గ్రామ శివారులో ఉన్న మానేరు నది పై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శనివారం తెలిపారు.

మానేరుపై హైలెవల్‌ బ్రిడ్జికి రూ. 203 కోట్లు

మంథని, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంథని మండలంలోని ఆరెంద గ్రామ శివారులో ఉన్న మానేరు నది పై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శనివారం తెలిపారు. 1.120 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హైలెవల్‌ బ్రిడ్జితో పాటు ఆరెంద, మల్లారం, వెంకటాపూర్‌ బ్రిడ్జి వరకు ఇరు వైపులా, దామెరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మం జూరు చేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ఆరెంద- భూపాలపల్లి జిల్లా దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు నది పై ఈ హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రజలకు, ప్రయాణికులకు, పలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మంథని ప్రాంతం నుంచి కాళేశ్వరం వెళ్ళడానికి 25 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వెళ్ళడానికి, కాళేశ్వరం టెంపుల్‌, టూరిజం అభివృద్ధికి దోహద పడుతుం దన్నారు. రెండు జిల్లాల్లోని వివిధ గ్రామాల ప్రజలకు విద్య, వైద్య, రవాణా పరంగా ఎంతో మేలు కలు గుతుందన్నారు. మానేరు నది పై భారీ వంతెన నిర్మాణం కోసం రూ. 203 కోట్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మంజూరు చేయించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:14 AM