రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి చేస్తాం
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:48 PM
సుల్తానాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు, ఐబీ కాంప్లెక్స్ గదుల నిర్మాణ పనుల పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులతో కలసి మంగళవారం సమీక్షించారు.
సుల్తానాబాద్, ఆగస్టు 19: (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు, ఐబీ కాంప్లెక్స్ గదుల నిర్మాణ పనుల పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులతో కలసి మంగళవారం సమీక్షించారు. పూర్తయిన గదులను ఆయన పరిశీలించారు. వారికి పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం రోడ్డు విస్తరణ పనుల గురించి మాట్లాడుతు ఐబీ చౌరస్తా నుంచి శాంతినగర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు మళ్ళీ కొనసాగుతాయని ఇందులో భాగంగా ప్రస్తుతం ఐబీ చౌరస్తా వద్ద ఉన్న షాపింగ్ గదులను తొలగించాల్సి వస్తుందని ఈ గదులను కూల్చడం కోసం వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వెనక కొత్తగా రూ.65 లక్షలతో గదులను నిర్మిస్తామని, ఇవి పూర్తి కావడంతోనే ముందున్న గదుల కూల్చివేత ప్రారంభించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు గాజుల రాజమల్లు, దామోదర్ రావు, మాజీ సర్పంచ్ గుర్రం రాజయ్య, సత్యం, వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, ఎండీ అమీనొద్దిన్, కుమార్ కిషోర్, రఫీక్, ఫరూక్, కిరణ్, గడ్డం అనిల్ తదితరులు పాల్గొన్నారు.