బహిరంగ విచారణకు రాని రియాజ్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:14 PM
గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూట బుల్ జాబ్ ఒప్పందం చేసు కున్న ఏఐటీయూసీపై అబ ద్దపు ఆరోపణలు చేసి ఆది వారం బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన హెచ్ ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ రాలేదని ఏఐటీ యూసీ నాయకులు ఆరోపిం చారు.
గోదావరిఖని, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూట బుల్ జాబ్ ఒప్పందం చేసు కున్న ఏఐటీయూసీపై అబ ద్దపు ఆరోపణలు చేసి ఆది వారం బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన హెచ్ ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ రాలేదని ఏఐటీ యూసీ నాయకులు ఆరోపిం చారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు, మడ్డి ఎల్లయ్యలు మాట్లాడారు. 2025, సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ సమక్షంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంటే వక్రీకరించి హెచ్‌ఎంఎస్ రియాజ్ ఏఐటీయూసీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
కార్మికవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో రియాజ్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. హెచ్‌ఎంఎస్‌లో పని చేసిన నాయకులను యాజమాన్యం బదిలీలు చేసి చార్జిషీట్లు ఇస్తే కాపాడుకోలేని రియాజ్ అహ్మద్ ఏఐటీయూసీని విమర్శించడం సరికాదన్నారు. గతంలో నాయిని నర్సిం హారెడ్డిని ముంచినట్టే ఇప్పుడు కల్వకుంట్ల కవితను కూడా రియాజ్ అహ్మద్ ముంచేస్తాడని వారు ఆరోపిం చారు. తమ యూనియన్‌పై, నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వారన్నారు. నాయ కులు రాజరత్నం, రాంచందర్, ఆరెల్లి పోషం, జిగురు రవీందర్, రాంచంద్రారెడ్డి, గౌతం గోవర్ధన్, మాదన మహేష్, రంగు శ్రీను, సతీష్‌బాబు పాల్గొన్నారు.