రియల్ ఎస్టేట్ దందా కోసమే రింగ్ రోడ్
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:10 AM
కూచిరాజ్‌పల్లి శివారులో రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి ఎమ్మెల్యే పట్టణ శివారులో రింగ్‌రోడ్ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఇటీవల మంత్రి రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన స్థలంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో సోదరుడికి వాటా ఉండటంతో రింగ్ రోడ్‌ను ఈ భూముల సమీపంగా తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేశారన్నారు.
మంథని, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కూచిరాజ్‌పల్లి శివారులో రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి ఎమ్మెల్యే పట్టణ శివారులో రింగ్‌రోడ్ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఇటీవల మంత్రి రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన స్థలంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో సోదరుడికి వాటా ఉండటంతో రింగ్ రోడ్‌ను ఈ భూముల సమీపంగా తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేశారన్నారు. రూ.300 కోట్లతో నిర్మించే రింగ్ రోడ్ నిర్మాణం వలన మంథని ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజ నం లేదన్నారు. రింగ్ రోడ్డు నిర్మించే సమీపంలోనే నేషనల్ గ్రీన్ ఫీల్డు హైవే నిర్మాణం కొనసాగుతుందన్నారు.
పుట్టపాకకు సమీపం నుంచే రింగ్ రోడ్డు ప్రారంభించి మల్లెపల్లి సమీపంలోని ఇంటర్ చేంజ్‌కు పక్క నుంచే గోదావరి నది వరకు నిర్మిస్తే మంథని ప్రజలకు ప్రయోజనం ఉండద న్నారు. రింగ్ రోడ్డు నిధులతో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిని ఆను కొని కూచిరాజ్‌పల్లి నుంచి బొక్కలవాగు, గొల్లగూడెం, బోయినిపేట, దొంతులవాడ మీదుగా గోదావరిఖని పాత రోడ్, బస్సు డిపో నుంచి ఎక్లాస్ పూర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే రాకపోకల సులభంగా ఉంటుంద న్నారు. ఆరెంద, అడవిసోమన్‌పల్లిల వద్ద మానేరు నదులపై వంతెనలు, నాగులమ్మ క్రాస్‌రోడ్డు వద్ద బ్రిడ్జిని ఇతర జిల్లాల రవాణా సౌకర్యం మెరు గు పడుతుందన్నారు. మంథని పట్టణంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించవచ్చన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రజలకు ఉప యోగ పడలాన్నదే తమ తపన అన్నారు. ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, గొబ్బూరి వంశీ, జంజర్ల శేఖర్, శ్రీనివాస్, తిరుపతి, సత్యనారాయణ, ఆసీఫ్, ఇర్ఫాన్, యాకూబ్‌లు పాల్గొన్నారు.