పేద ప్రజల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:03 AM
పేద్రపజల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్దిందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. గురు వారం మండలంలోని పెద్దకల్వలలో సన్నబి య్యం లబ్ధిదారుడు చిట్టవేన లక్ష్మి ఇంట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణు తో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10 (ఆంధ్ర జ్యోతి): పేద్రపజల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్దిందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. గురు వారం మండలంలోని పెద్దకల్వలలో సన్నబి య్యం లబ్ధిదారుడు చిట్టవేన లక్ష్మి ఇంట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణు తో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ సన్నబియ్యం బువ్వ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సన్న బి య్యం పథకం ద్వారా పేదల కళ్లల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నార న్నారు. గతంలో దొడ్డు బియ్యంతో దళారులు, రైస్ మిల్లర్లు లాభం పొందారని గుర్తు చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజల ఆకలి గోస తీర్చేందుకు సన్న బియ్యం పంపి ణీ అనేది గొప్ప వరమన్నారు. దేశ చరి త్రలోనే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పలు రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య, ఎంపి డివో శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీసర్పంచ్ కారెంగుల రమేశ్, మాజి ఉపసర్పంచ్ అర్కుటి సంతోష్, జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పెగడ రమేష్, నాయకులు ఓడ్నాల రమేష్, ఉప్పు సతీష్ పటేల్, ఉప్పుసాగర్‌పటేల్ పాల్గొన్నారు.
90 శాతం బియ్యం పంపిణీ పూర్తి
జిల్లాలో 90 శాతం వరకు సన్నబియ్యం పంపిణీ పూర్తయిందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఈనెల 4న సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తే నాలుగు రోజుల్లో 90 శాతం పైగా పూర్తయిందని, సన్నబియ్యం పంపిణీకి మంచి స్పందన ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.