మహిళలను గౌరవించడం సంప్రదాయం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:50 PM
మహిళలు మహాశక్తి ప్రతిరూపాలని, వారిని గౌరవించాలని ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం జీడినగర్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ చేశారు.
పాలకుర్తి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలు మహాశక్తి ప్రతిరూపాలని, వారిని గౌరవించాలని ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం జీడినగర్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోటి మంది మహిళ లను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటూ ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభు త్వం నాసిరకపు చీరలను అందజేసిందని విమర్శించారు. రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మహి ళ సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంఫిణీ చేశారు. మనాలి ఠాకూర్, తహసీల్దార్ జేరుపోతుల సునీత, ఎంపీడివో పొల్సాని ఽశశికళ, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు సూర సమ్మయ్య, పర్శవేని శ్రీని వాస్ యాదవ్, పొన్నం సత్తయ్యగౌడ్, మల్లెత్తుల శ్రీని వాస్, నాయకులు పీట్ల గోపాల్, బొదాసు శంకరయ్య, మహిళలు పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఇందిరా మహిళా శక్తి కార్యక్ర మంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, మహిళలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్దపీట వేస్తుందని పేర్కొ న్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ, పెట్రో ల్ బంక్‌ల ఏర్పాటు, పాడి పరిశ్రమలు, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలే మహారాణులుగా భావి స్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ టాకూర్, తహసిల్దార్ తూము రవీందర్, నాయకులు గుడిమెట్ల రాజలింగం, గడ్డాల మహేష్, బండి తిరుపతిగౌడ్, పూదరి సత్తయ్యగౌడ్, గాదె సుధాకర్, పెండ్రు హనుమాన్ రెడ్డి, సింగం కిరణ్ గౌడ్, ఆవుల గోపాల్ యాదవ్, నూనె విజయ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.