Share News

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు..

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:19 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన జడ్పీ చైర్మన్‌, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు స్థానాలకు రిజర్వుషన్లు ఖరారయ్యాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం జీవో 9 జారీ చేసింది.

స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన జడ్పీ చైర్మన్‌, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు స్థానాలకు రిజర్వుషన్లు ఖరారయ్యాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం జీవో 9 జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, 2024 కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా బీసీల జనా భా వివరాలను ఐదు రోజుల క్రితమే కలెక్టర్లకు అందిం చింది. ఈనెల 24వ తేదీ నాటికి సర్పంచులు, ఎంపీ టీసీలు, వార్డు స్థానాలు ఎంపీపీలు, జడ్పీటీసీల రిజర్వే షన్లను రొటేషన్‌ ప్రకారం ఖరారు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండడంతో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైన తర్వాత శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, డి వేణు, జడ్పీ సీఈఓ నరేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ఆర్‌డీఓలు గంగయ్య, సురేష్‌, మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, జనరల్‌ స్థానాలకు రోటేషన్‌లో ఖరారు చేయగా, పెరిగిన బీసీ స్థానాలకు సంబంధించి కొన్నిం టికి డ్రా తీసి నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ల జాబి తాలను సంబంధిత అధికారులు కలెక్టర్‌ సంతకం లేకుండా విడుదల చేయరాదని చెబుతున్నారు. హైదరా బాద్‌లో జరిగిన సమావేశానికి కలెక్టర్‌ వెళ్లగా, అధికా రికంగా రిజర్వేషన్ల జాబితాలు ఆదివారం విడుదల చేయనున్నారు.

రిజర్వేషన్లు ఇలా..

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించారు. 13 జడ్పీటీసీ స్థానాలకు, 13 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జడ్పీటీసీ స్థానాల్లో 3 ఎస్సీలకు, 6 బీసీలకు, 4 జనరల్‌కు కేటాయించారు. గతంలో కంటే బీసీలకు 3 స్థానాలు పెరిగాయి. జూలపల్లి ఎస్సీ మహి ళకు, ధర్మారం, పాలకుర్తి ఎస్సీ జనరల్‌కు కేటాయిం చారు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, అంతర్గాం బీసీ మహిళకు, సుల్తానాబాద్‌, రామగిరి, మంథని బీసీ జనరల్‌కు, కమాన్‌పూర్‌, ఓదెల జనరల్‌ మహిళ, ఎలిగేడు, ముత్తారం జనరల్‌కు కేటాయించారు.

ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎలిగేడు, పాలకుర్తి ఎస్సీ జనరల్‌, జూలపల్లి ఎస్సీ మహిళ, సుల్తానాబాద్‌, మంథని బీసీ మహిళ, ధర్మారం, అంతర్గాం బీసీ జనరల్‌, రామగిరి, పెద్దపల్లి, ఓదెల, కమాన్‌పూర్‌ జనరల్‌, కాల్వశ్రీరాంపూర్‌ జనరల్‌ మహిళ, ముత్తారం మహిళకు రిజర్వు అయ్యింది.

2019 ఎన్నికల్లో ఎస్సీలకు రెండు స్థానాలు కేటా యించగా, ఈసారి నాలుగు స్థానాలు స్టేట్‌ కోటా ప్రకా రం కేటాయించగా, స్వల్ప మార్పుతో మూడు స్థానాలకే పరిమితం చేశారు. బీసీలకు గతంలో 5 స్థానాలు ఉం డగా, ఈసారి కూడా 5 స్థానాలే కేటాయించారు. 13 ఎంపీపీ స్థానాల్లో మహిళలకు సగం అంటే 6 లేదా 7 దక్కాల్సి ఉండగా, 5 స్థానాలే దక్కాయి.

జిల్లాలో బీసీలకు 109 సర్పంచ్‌ స్థానాలు..

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇం దులో ఎస్సీలకు 51 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు, బీసీలకు 109 స్థానాలు, జనరల్‌కు 98 స్థానాలను రిజర్వు చేసినట్లు సమాచారం. ఎంపీటీసీ స్థానాలు 137 ఉండగా, ఎస్సీలకు 26 స్థానాలు, ఎస్టీలకు 3 స్థానాలు, బీసీలకు 58 స్థానాలు, జనరల్‌కు 50 స్థానాలు కేటాయించారని తెలుస్తున్నది.

Updated Date - Sep 28 , 2025 | 12:19 AM