Share News

జీఎస్టీ తగ్గింపుతో ఊరట

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:01 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీ తగ్గించడంపై హర్షిస్తూ బీజేపీ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో గురువారం జెండా చౌరస్తా వద్ద ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

జీఎస్టీ తగ్గింపుతో ఊరట

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీ తగ్గించడంపై హర్షిస్తూ బీజేపీ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో గురువారం జెండా చౌరస్తా వద్ద ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పాల ఉత్పత్తుల నుంచి ఆటో మొబైల్స్‌ వరకు జీఎస్టీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడానికి వస్తువులు, సేవల పన్ను సవరణలపై నిర్ణయం తీసుకున్నారని, తగ్గించిన జీఎస్టీతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట లభించనున్నదన్నారు. పెంజర్ల రాకేష్‌, వేల్పుల రమేష్‌, తంగేడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్‌ రావు, గుడ్ల సతీష్‌, బోలోవేన సురేందర్‌, మామిడి ఉమేష్‌, బొడ్డుపల్లి కుమార్‌, ముంజ రాజేంద్రప్రసాద్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:01 AM