Share News

సింగరేణి కార్మికులకు ఊరట

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:07 AM

కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులను పెంచడంతో సింగరేణి కార్మికులకు భారీ ప్రయోజనం కలగనుంది. యేటా సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఇన్‌కంటాక్స్‌ సింగరేణి కార్మికులు చెల్లిస్తున్నారు.

సింగరేణి కార్మికులకు ఊరట

గోదావరిఖని, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులను పెంచడంతో సింగరేణి కార్మికులకు భారీ ప్రయోజనం కలగనుంది. యేటా సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఇన్‌కంటాక్స్‌ సింగరేణి కార్మికులు చెల్లిస్తున్నారు. నూతన బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులు పెంచడంతో సిం గరేణి కార్మికులకు యేటా సుమారు రూ.500కోట్లు ఆదా య పన్ను మినహాయింపు జరుగనున్నది.

సింగరేణిలోని 40వేల మంది ఎన్‌సీడబ్ల్యూఏ కార్మి కుల్లో 15వేల మంది సీనియర్‌ కార్మికులు వివిధ గ్రేడ్‌ లకు సంబంధించిన వారు మినహా రూ.12లక్షల ఆదా యానికి లోబడి ఉన్న కార్మికులు 25వేల మంది ఉన్న ట్టు అంచనా. రూ.12లక్షల రిబేట్‌తో కలిపి ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపులు వర్తించడంతో సగానికిపైగా కార్మికులకు వచ్చే సంవత్సరం ఇన్‌కంటాక్స్‌ ఉండదు. వేజ్‌బోర్డు అమలుతో కార్మికులకు వేతనాలు భారీగా పెరిగాయి. దీనికి తోడు సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయల నికర లాభాలు సాధించడం, అందులో 33శాతం వాటా చెల్లించడంతో ప్రతీ కార్మికుడికి కనిష్టంగా రూ.1.5లక్షలు, గరిష్టంగా రూ.3లక్షల వరకు లాభాలతో ఆదాయం పెరుగుతోంది. దీనికి తోడు దీపావళి బోనస్‌ రూ.90వేలు కార్మి కులకు వస్తున్నది. నెల వేతనాలు, లాభాల వాటా, దీపావళి బోనస్‌ కలిసి కార్మికులకు రూ.10లక్షలకుపైబడి సీనియర్‌ కార్మికులు రూ.20లక్షల వరకు యేటా వస్తోంది. దీంతో సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల జీతాల్లో నుంచి ప్రతీ నెల వారి ఆదాయాన్ని బట్టి రూ.10వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయ పన్ను కింద కోత విధిస్తున్నది. ఇంత భారీ మొత్తంలో తమ కష్టార్జితం ఆదాయ పన్ను కింద పోతున్నదని, సంవత్సరానికి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయ పన్ను కింద ఖర్చు అవుతున్నదని సింగరేణి కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వేతనంలో సుమారు 30శాతం ఇన్‌కంటాక్స్‌ కిందనే వెళుతుందని ఆవేదన చెందుతున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండాలని, అన్నీ ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, కార్మికులు మూడు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా అది సాధ్యం కావడం లేదు. కానీ నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్‌ స్లాబ్‌లను పెంచడంతో అనూహ్యంగా వేతన జీవులతో పాటు సింగరేణి కార్మికవర్గానికి కూడా ఉపశమనం కలిగింది. రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కార్మికులకు రిబేట్‌తో సహా ట్యాక్స్‌ మినహాయింపు దొరకడంతో కార్మికవర్గంలో ఇదే చర్చ నడుస్తున్నది. ప్రస్తుత సంవత్సరం వరకు రూ.4లక్షల వరకే జీరో ట్యాక్స్‌ ఉండి రూ.7.5లక్షల వరకు 87(ఎ) ప్రకారం రిబేట్‌ లభించేది. ఆ తరువాత ఆదాయానికి స్లాబుల పద్ధతిలో ట్యాక్స్‌ ఉండేది. ఇప్పుడు రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు 5శాతం, రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు 10శాతం ఆదాయ పన్ను విధిస్తూ రూ.12లక్షల వరకు రిబేట్‌ ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు కలిగిం చడం కార్మికులకు ఊరటనిస్తోంది. రూ.12లక్షలు దాటిన ఆదాయం ఉన్న కార్మికులకు మాత్రం ఆదాయ పన్ను మారిన స్లాబులతో పెద్దగా ప్రయోజనం జరుగలేదు. అయితే రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు 15 శాతం, ఆ తరువాత రూ.20లక్షల వరకు 20శాతం మాత్రమే ఆదాయ పన్ను విధించడంతో ఆ స్లాబుల్లో ఉండే అత్యధిక ఆదాయం ఉన్న కార్మికులకు కూడా కొంత ఊరట లభించనున్నది. మొత్తంగా సింగరేణి కార్మికవర్గానికి నూతన ఆదాయ పన్ను విధానంతో రూ.500కోట్ల వరకు ఆదాయ పన్ను మినహాయింపు దొరికినట్టే. సింగరేణి సంస్థకు అత్యధికంగా లాభాలు వచ్చి కార్మికుల లాభాల వాటా శాతం పెరిగితే కార్మి కుల ఆదాయం మళ్లీ పెరుగుతుంది. దీంతో మళ్లీ సింగరేణి కార్మికులకు ఇన్‌టాక్స్‌ రూపంలో ఆర్థిక భారం తప్పదు.

Updated Date - Feb 03 , 2025 | 12:07 AM