Share News

యూనిట్ల మంజూరులో నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:50 PM

అర్హులకు యువ వికాసం కింద స్వయం ఉపాధి యూనిట్‌ మంజూరు చేయాలని, నిబంధనలు పాటించా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజీవ్‌ యువ వికాసంపై సంబం ధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజీవ్‌ యువ వికా సం కింద వచ్చిన దరఖాస్తుదారులు గతంలో ఏదైనా ఎన్‌పిఏ, వారి క్రెడిట్‌ హిస్టరీ పరిశీలించి అర్హులైన జాబితా బ్యాంకర్ల ద్వారా సేకరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

 యూనిట్ల మంజూరులో  నిబంధనలు పాటించాలి

పెద్దపల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): అర్హులకు యువ వికాసం కింద స్వయం ఉపాధి యూనిట్‌ మంజూరు చేయాలని, నిబంధనలు పాటించా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజీవ్‌ యువ వికాసంపై సంబం ధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజీవ్‌ యువ వికా సం కింద వచ్చిన దరఖాస్తుదారులు గతంలో ఏదైనా ఎన్‌పిఏ, వారి క్రెడిట్‌ హిస్టరీ పరిశీలించి అర్హులైన జాబితా బ్యాంకర్ల ద్వారా సేకరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈనెల 14 వరకు ఎంపిడివోలు మండలాల వారీగా బ్యాం కులో ఆమోదించిన అర్హుల జాబితా వివరాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి సమర్పించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డీఆర్‌డీవో అర్హుల జాబితా వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అప్ప గించాలని, జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితా తయారు చేస్తామన్నారు. దాని ప్రకారం లబ్ధిదారుని పేరు మీద బ్యాం కు ఖాతా ప్రారంభించాలని, జూన్‌ 1 లోపల యువ వికాసం యూనిట్‌ మంజూరు పత్రాలు జారీ చేయాలని, రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి యూనిట్ల గ్రౌండింగ్‌ పై శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ అధికారు లకు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, జడ్పి సీఈఓ నరేందర్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:50 PM