ప్రజా సేవలో లయన్స్ క్లబ్‌కు గుర్తింపు
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:00 AM
ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ గుర్తింపు పొందిందని, అదే స్ఫూర్తితో ప్లాస్టిక్ భూతా న్ని తరిమివేయడానికి కృషి చేయాలని ప్రముఖ కవి, కళాకారుడు జయరాజ్ అన్నారు. ఆదివారం బొమ్మరెడ్డిపల్లి మహేశ్వరా ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మెన్ తన్నీరు రాజేందర్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రీజనల్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ధర్మారం పిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ గుర్తింపు పొందిందని, అదే స్ఫూర్తితో ప్లాస్టిక్ భూతా న్ని తరిమివేయడానికి కృషి చేయాలని ప్రముఖ కవి, కళాకారుడు జయరాజ్ అన్నారు. ఆదివారం బొమ్మరెడ్డిపల్లి మహేశ్వరా ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మెన్ తన్నీరు రాజేందర్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రీజనల్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైద్య శిబిరాలు నిర్వహించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయ మన్నారు. ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్న తన్నీరు రాజేం దర్‌ను జయరాజ్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు అం దరూ కృషిచేయాలని క్లబ్ సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఆర్‌సి చైర్మెన్ రాజేందర్, క్లబ్ మహిళా ప్రధాన కార్యదర్శి తన్నీరు పద్మ జయరాజును సన్మానించి జ్ఞాపికను అందజేశారు.