రామగుండాన్ని సింగరేణి సిటీగా నవ నిర్మాణం చేస్తాం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:00 AM
రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.
గోదావరిఖని, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ రామగుం డంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని పాదయాత్ర చేసిందని, ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కేంద్రం మంజూరు చేస్తే వ్యతిరేకిస్తుం దన్నారు. విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించే బీఆర్‌ఎస్ శక్తులు దమ్ముంటే బయటకు రావాలని, ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రూ.450కోట్లతో పాల కుర్తి లిఫ్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌కు నిధులు మంజూరయ్యా యని, జీఓ విడుదలైందన్నారు.
మాట్లాడితే బూడిద, ఇసుక అంటూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. బస్టాండ్, రాజేష్ థియేటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేసి చిరు వ్యాపారులకు ఇస్తున్నామని, త్వరలోనే మల్టీఫ్లెక్స్‌ల నిర్మాణం జరుపనున్నామన్నారు. త్వరలో హౌసింగ్ బోర్డు వద్ద పట్టాలు ఇవ్వనున్నామని, ట్రాన్స్‌జెండర్లకు గృహ నిర్మాణాలు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ను సన్మానించారు. మనాలీఠాకూర్, మాజీ మేయర్లు బంగి అనీల్ కుమార్, రాజమణి, నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, లింగస్వామి, పాల్గొన్నారు.