వెయ్యి కోట్లతో రామగుండం అభివృద్ధి
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:02 AM
అభివృద్ధి పనులతో రామగుండానికి కొత్త రూపు సంతరించుకుందని ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో రూ.5.73కోట్ల నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు.
కోల్‌సిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులతో రామగుండానికి కొత్త రూపు సంతరించుకుందని ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో రూ.5.73కోట్ల నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. జనగామలో జరిగిన కార్యక్రమంలో స్థానిక రైతులు ఆయనను సన్మానించారు. రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రామగుండం అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. నగరంలో ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, కాలనీల్లో అభివృద్ధి పనులు జరు గుతున్నాయన్నారు. జనగామ గ్రామాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారని, జనగామ త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయ పున రుద్ధరణకు రూ.10కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్న మూడు మార్గాలను విస్తరించడానికి గ్రామస్థులు సహకరించాలన్నారు. ప్రణాళికబద్ధంగా నగ రాభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. మాతంగి కాలనీలో రూ.1.81 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రెండేళ్ల కాలంలో ఈ ప్రాం తంలో రూ.4కోట్లు నిధులు వెచ్చించామని, మరో రూ.2కోట్లు ఇస్తామన్నారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరుణ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఈ గురువీర, ఈఈలు రామన్, శివానంద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, బాలరాజ్‌కు మార్, దాతు శ్రీనివాస్, గంగశ్రీను, బెంద్రం రాజిరెడ్డి, పోషం, కృపాకర్‌రావు, జువ్వాడి విజయ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.