Share News

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రతో పార్టీకి పూర్వవైభవం

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:51 PM

రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎంపీ జై కుమార్‌ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో, జిల్లాలో బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రతో పార్టీకి పూర్వవైభవం

గోదావరిఖని, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎంపీ జై కుమార్‌ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో, జిల్లాలో బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని, 22నెలల కాలంలో తెలంగాణరాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విమానాశ్రయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సర్వే నిర్వహించడం శుభ పరిణామమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పకుండా పదవులు వస్తాయని, కాంగ్రెస్‌ పార్టీ 33జిల్లాల్లో నూతనంగా అధ్యక్షులను మార్పు చేయనున్నట్టు, నూతన జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణను నిర్వహించడం జరుగుతుందని, పోటీలో ఉండే పోటీదారుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నట్టు, ఈ నెల 19వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, 22న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు జాబితాను అందిస్తామని, తదుపరి అధిష్టానం ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. నేషనల్‌ ఓబీసీ సెల్‌ కో ఆర్డినేటర్‌ పెతూరి వెంకటేష్‌, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ కాసిపాక రాజేష్‌, ప్రొటోకాల్‌ కో ఆర్డినేటర్‌ బాసిద్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగస్వామి,పెద్దెల్లి ప్రకాష్‌, అనుమ సత్యనారాయణ, సర్వర్‌, హమీద్‌, దాసరి విజయ్‌ పాల్గొన్నారు.

కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి...

పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని ఐఎన్‌టీయూసీ సీనియర్‌ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఏఐసీసీ పరిశీలకులు జై కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గురువారం జ్యోతి భవన్‌లో పరిశీలకుడిని కలిసి జిల్లా అధ్యక్షుడు, రామగుండం కార్పొరేషన్‌ అధ్యక్షుడి నియామకంపై వారు చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీని బలపరిచే దిశగా కార్యకర్తలను ప్రోత్సహించాలని, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో క్రమశిక్షణ, పార్టీ కోసం త్యాగం చేసిన వారిని అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఆయన కోరారు. పరిశీలకుడిని కలిసిన వారిలో ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లు, దుబాసి మల్లేష్‌, ఊట్ల కిరణ్‌ ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:51 PM