నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి
ABN , Publish Date - May 03 , 2025 | 11:53 PM
కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యా న్ని సత్వరమే కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం మండ లంలోని అప్పన్నపేట, అందుగులపల్లి, కుర్మ పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రా లను తనిఖీ చేశారు.
పెద్దపల్లి రూరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యా న్ని సత్వరమే కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం మండ లంలోని అప్పన్నపేట, అందుగులపల్లి, కుర్మ పల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రా లను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగా లన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం తర లింపునకు అవసరమైన వాహనాలు, హమా లీలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమ త్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టార్పాలిన్ కవర్లతో ధాన్యం తడ వకుండా జాగ్రత్త వహించాలని సూచిం చారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతు లు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫా లిన్ కవర్లు, వెయింగ్, తేమ యంత్రాలు అందుబా టులో ఉండాలన్నారు. అప్పన్నపేట సింగిల్ విండో సీఈవో తిరుపతి పాల్గొన్నారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేం ద్రంలో ప్యాడి క్లీనర్లు తప్పని సరిగా ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా వాహనాలు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్వాహకులకు సూచించారు. శనివారం బసం త్‌నగర్, కుర్మపల్లి కొనుగోలు కేంద్రాలను తని ఖీ చేశారు. తహసీల్దార్ ముద్దమళ్ల జ్యోతి తదితరులున్నారు.