ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:56 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈఓ మహేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం లోని పలువాడల్లో తల్లిదండ్రులను కలిశారు. ఎంఈఓ మాట్లాడుతూ మీపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈఓ మహేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం లోని పలువాడల్లో తల్లిదండ్రులను కలిశారు. ఎంఈఓ మాట్లాడుతూ మీపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. గుణా త్మకమైన విద్య, ఉచిత పాఠ ్య పుస్తకాలు, ఉచిత నోట్‌బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, తదితర వాటి గురించి కరపత్రాలద్వారా వివరించారు. మధ్యలో మానేసినవారు కూడా ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఓపెన్ ఇంటర్, టెన్త్‌లో ప్రవేశాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అత్త రాజారాం, ఉపాధ్యాఉలు ఉన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ప్రయోజకులుగా చూడండిని ఎంఈవో అనసూరి నరేంద్రచారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవేందర్‌రావులు అన్నారు. ఎలిగేడు, సుల్తాన్ పూర్, ఐతరాజ్‌పల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమాలను నిర్వహిం చారు. ఐతరాజ్‌పల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి జడ్‌పిహెచ్ ఎస్ సుల్తాన్‌పూర్ పాఠశాల వసతుల గురించి వివరించారు. హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, కుమారస్వామి, రాములు, పిడి శ్రీనివాస్, సీఆర్‌పి లక్ష్మినారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.