ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:59 PM
ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తానని, గత ఎన్నికలలో వారికి ఇచ్చిన హామీ మేరకు శాస్త్రినగర్‌లో భూమి బదలాయించి వారి రాకపోకలను సుగమం చేశా నని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శాస్ర్తినగర్ వద్ద గల పోలీస్ ల్యాండ్‌తో శాస్త్రినగర్ ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సాయిరి పద్మ మహేందర్‌లు గత ఎన్నికలలో విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లారు.

సుల్తానాబాద్ , ఫిబ్రవరి 9: (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తానని, గత ఎన్నికలలో వారికి ఇచ్చిన హామీ మేరకు శాస్త్రినగర్‌లో భూమి బదలాయించి వారి రాకపోకలను సుగమం చేశా నని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శాస్ర్తినగర్ వద్ద గల పోలీస్ ల్యాండ్‌తో శాస్త్రినగర్ ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సాయిరి పద్మ మహేందర్‌లు గత ఎన్నికలలో విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పోలీస్ వారికి వేరే చోట భూమి బదలాయించడంతో ఆదివారం అత్మీయ కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు సర్వే నంబర్ 228లో ఉన్న 30 గుంటల భూమిని 229 సర్వే నంబర్‌లోకి బదిలీ చేయించినట్లు తెలిపారు. దాంతో రాకపోకలను పునరుద్దరించడానికి రోడ్డు ఏర్పాటు చేసుకోగా ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.250 కోట్లతో శాస్త్రినగర్‌లో దశల వారీగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. పలువురు నాయ కులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కండు వాలు కప్పి ఆహ్వానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్య, మార్కెట్ చైర్మన్ ప్రకాష్‌రావు, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, కేడీసీసీబీ డైరక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి పద్మ మహేందర్, అబ్బయ్యగౌడ్, సతీష్, బిరుదు క్రిష్ణ, పన్నాల రాములు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.