Share News

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:46 PM

ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డి.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

పెద్దపల్లిటౌన్‌, జూలై 14 (ఆంఽధ్రజ్యోతి): ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డి.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన ఆర్‌.తిరుపతి కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులో ఉన్న చిన్న కుంట చెరువు శిఖం భూమి కొందరు గ్రామస్థులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, పందిళ్ళ శిఖం భూమి పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌కు విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పాలకుర్తి మండలం బామ్లానాయక్‌ తండ మాజీ సర్పంచ్‌ గ్రామస్థులు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల జాబితా విడుదల చేయలేదని, అర్హుల జాబితా విడుదల చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులకు రాశారు. సుల్తానాబాద్‌ మండలం కందు నూరిపల్లి గ్రామానికి చెందిన జి. సదయ్య దివ్యాంగుడినని, గతంలో అంత్యోదయ కార్డు ఉండేదని 30 కేజీల బియ్యం వచ్చేదని ప్రస్తుతం రావడం లేదని, కార్డు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌కు రాస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:46 PM