ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:05 AM
) ప్రజల అర్జీ లను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 16 (ఆంఽధ్రజ్యోతి) ప్రజల అర్జీ లను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సెట్టు సురేష్ జిల్లా పరిధిలో ఎన్ని కబేళాలకు అనుమతులు ఉన్నాయో వివరాలు తెలుపాలని దర ఖాస్తు చేశారు. పెద్దకాల్వల గ్రామానికి చెందిన బోంగు రాజమ్మ భర్త మల్లయ్యకు బోదకాలు ఉన్నందున దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా డీఆర్‌డీఏ పీడీకి రాశారు. సుల్తానాబాద్ మం డలం తొగర్రాయి గ్రామానికి చెందిన పాలకుర్తి లక్ష్మి గ్రామ శివారు సర్వే నెంబర్ 645లో తమ కుటుంబానికి చెందిన భూములను కుమారునికి తెలియకుండా రెండో కోడలు రజిత పహాణీలో పట్టాదారుగా నమోదు చేసు కుందని, చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పిం చాలని దరఖాస్తు చేసుకొంది.
కళ్యాణ్‌నగర్,(ఆంధ్రజ్యోతి): ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు నాణ్యమైన విద అందించాలని కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా వాణిలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బరిగెల ప్రసన్నకు మార్ అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మూడు సం వత్సరాలనుంచి అరకొర నిధులు విడుదల చేయడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బడ్జెట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.