ఎయిడ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:56 PM
ఎయిడ్స్‌పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిరి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత ఎయిడ్స్‌పై సరైన అవగాహనతో ఉండాలన్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. రక్తమార్పిడి, రక్షణలేని శృంగారం, తదితర చర్యల వల్ల వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇతరులు వాడిన షేవింగ్ బ్లేడ్లు, సిరంజ్‌ల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు స్ర్కీనింగ్ చేయించుకోవాలని, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఏఆర్‌టీ మందులు రెగ్యులర్‌గా వాడాలన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, మందులు వాడుకుంటూ డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించా లన్నారు. దీని వల్ల టీబీ, టీబీ ఉన్న వారికి హెచ్‌ఐవీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని ఎన్జీఓలు, నెట్‌వర్క్‌లు, సీబీఓలు, వైద్యసిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిసు ్తన్నారని తెలిపారు. హెచ్‌ఐవీ నివారణలో అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్ సింధూర, కౌన్సిలర్ సత్యానందం, ఎల్‌టీలు సుకుమార్, రాజేష్ కుమార్, సఫియా, ఎస్‌టీఎస్ తిరుపతిలకు ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. సాంస్కృతిక కళాజాత బృందం పాటల ద్వారా అవగాహన కల్పించారు. అధికారులు సుధాకర్ రెడ్డి, రాజమౌళి, లయన్స్‌క్లబ్ కార్యదర్శి సత్యనారాయణ, అధ్యక్షుడు రాంకిషన్, రాజగోపాల్, నీలిమ, బిక్షపతి, లావణ్య, శ్రీనివాస్, రవి, సత్యానందంతోపాటు ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఎన్జీఓలు, నెట్‌వర్క్ సీబీఓలు, ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.