Share News

బీమాతో కుటుంబాలకు భరోసా

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:24 AM

ప్రతీ కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరి యంలో నిర్వహించిన బీమా మేళాలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు.

బీమాతో కుటుంబాలకు భరోసా

జ్యోతినగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరి యంలో నిర్వహించిన బీమా మేళాలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. ఏదైన ప్రమాదం జరిగి దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే కార్మికుడి కుటుంబానికి పరిహారం వస్తుందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న కార్మికులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, రీజినల్‌ మేనేజర్‌ రవిందర్‌సింగ్‌, రామకృష్ణ, ఎస్‌బీఐ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, మున్సిపల్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ పి.శ్రీనివాస్‌, జూని యర్‌ అసిస్టెంట్‌ శంకరస్వామి, సాయి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కుమారస్వామి, కిరణ్‌, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:24 AM