విద్యార్థులకు వినికిడి యంత్రాల అందజేత
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:47 PM
జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న పది మంది వినికిడి లోపంగల విద్యార్థులకు గురువారం జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి చేతుల మీదుగా వినికిడి పరికరాలను అందజేశారు. కలెక్టరేట్‌లో రాష్ర్టీయ బాల స్వాస్థ్య ద్వారా గుర్తించిన విద్యార్థులకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అలీమ్ కో ట్రస్టు వారు పరీక్షలు నిర్వహించి పరికరాలను అందజేశారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో చదువుకుంటున్న పది మంది వినికిడి లోపంగల విద్యార్థులకు గురువారం జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి చేతుల మీదుగా వినికిడి పరికరాలను అందజేశారు. కలెక్టరేట్‌లో రాష్ర్టీయ బాల స్వాస్థ్య ద్వారా గుర్తించిన విద్యార్థులకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అలీమ్ కో ట్రస్టు వారు పరీక్షలు నిర్వహించి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అంగన్‌వాడీ, పాఠశాలలకు వచ్చే సమయాల్లో ముందుగా తేదీలను నిర్ణయించాలని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలన్నారు.
సాయంత్రం వరకు వారితో ఉండి హాజరును నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో వంటగదిని, పరిశుభ్రత పాటించాలని, పని చేసే సిబ్బందికి శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. వంట గది సమీపంలో మునగ, కరివేప చెట్టును పెంచాలని, వీటిని వంటలో విరివిగా వినియోగిస్తే విటమిన్ ఏ లోపం ఉండదని తెలిపారు. జిల్లా ఎర్లీ ఇంటర్వేన్షన్ సిబ్బంది కూడా సాయంత్రం వరకు ఉండి రిఫరల్ వచ్చిన కేసులకు ట్రీట్‌మెంట్ అందించాలని ఆదేశించారు. ఆర్‌బీఎస్‌కే ప్రొగ్రాం అధికారి కిరణ్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది, స్వర్ణలత, ఫీల్డ్ రిలేషన్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.