Share News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:32 AM

రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో తెలంగాణ గురుకులాల కాంట్రాక్ట్స్‌తో పాటు మండలంలోని ఆర్‌ఎంపీ డాక్డర్ల సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ధర్మారం జూలై 6 (ఆంఽఽధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో తెలంగాణ గురుకులాల కాంట్రాక్ట్స్‌తో పాటు మండలంలోని ఆర్‌ఎంపీ డాక్డర్ల సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్‌ చార్టీలకు పెంచడంతోనే గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందన్నారు. గురుకులాల కాంట్రాక్టర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగారావు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్స్‌ ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంతి దృష్టికి తీసుకురాగ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అడ్లూరి హామీ ఇచ్చారు. ఆర్‌ఎంపీల సంఘం ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. ఆర్‌ఎంపీల సంఘ భవనానికి విద్యుత్‌ సౌకర్యం కోసం ట్రాన్స్‌ఫార్మర్‌, నీటి సౌకర్యం కోసం బోర్‌వెల్‌, సంఘ భవన ప్రహరీ నిధుల మంజూరు చేయాలని కోరారు. అనంతరం మొహర్రం సందర్భంగా మండల కేంద్రంలో పీరీలను మంత్రి దర్శించుకున్నారు. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లానాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, ఆర్‌ఎంపీల మండల అధ్యక్షుడు పుచ్చకాయల మునీందర్‌, ఎండీ బాబ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:35 AM