Share News

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:51 PM

ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ పని తీరుపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ నెలలో 263 ప్రసవాలు జరిగాయని, ప్రసవాల సంఖ్య పెరగడంపై వైద్యులను అభినందించారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు6(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ పని తీరుపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ నెలలో 263 ప్రసవాలు జరిగాయని, ప్రసవాల సంఖ్య పెరగడంపై వైద్యులను అభినందించారు. ప్రసవం తర్వాత బాలింతలు, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు ప్రభుత్వ స్కూల్‌ లను తనిఖీ చేస్తూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పోషక లోపాలతో ఉన్న పిల్లల కోసం రామగుండంలో ఎన్‌ఆర్‌సీ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. టీబీ రోగులకు న్యూట్రిషన్‌ కిట్‌, అవసరమైన మందులు అందేలా చర్యలు చేపట్టాల న్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు అన్ని రకాల వైద్యల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోగులకు డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా పరీక్షలు నిర్వ హించి, ఫలితాలు అందించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారి వాణిశ్రీ అధికారులు ఉన్నారు.

పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించాలి

పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించాలని కలె క్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో విద్యా ప్రమా ణాల పెంపుపై 22 పాఠశాలల హెడ్‌ మాస్టర్లతో సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యుత్తమంగా పని చేస్తున్న 22 పాఠశాలలను ఎంపిక చేసి అభినందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో మం చి విద్యాబోధన కొనసాగించాలని, తోటి టీచర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. మచ్చుపేట పాఠశాల ఊరికి దూరంగా ఉందని, ఆటో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరగా ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో బాగా పని చేసే పాఠశాలలో ఏఎక్స్‌ఎల్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:51 PM