రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:55 PM
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రంలో మెరుగైన వైద్యసేవలందించిన సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు.
కళ్యాణ్‌నగర్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని మాతాశిశు కేంద్రంలో మెరుగైన వైద్యసేవలందించిన సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అక్టోబరు నెలలో 240ప్రసవాలు నిర్వహించడం అభినం దనీయమని, సూపరింటెండెంట్, వైద్యాధికారులను, ఆసుపత్రి సిబ్బం దిని అభినందించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెదలా లని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుప త్రికి వచ్చే రోగులు, అటెండర్ల వద్ద ఎవరైనా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. దండె రాజు అధ్యక్షతన జరు గగా సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, డీఎంహెచ్‌ఓ వాణి, అరుణతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి
పెద్దపల్లి కల్చరల్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రతీ మండలంలోని మండల విద్యాశాఖ అధికారి తన పరిధిలోని పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి విద్యా శాఖపై సమీక్ష నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ సంబంధించి జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల పురోగతి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం వల్ల జిల్లా వెనుకబడి ఉందని కలెక్టర్ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు రెగ్యులర్‌గా పాఠశాలలను విజిట్ చేస్తూ సదరు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈఓ నరేందర్, డీఈఓ డి మాధవి, ఎంఈఓలు పాల్గొన్నారు.