రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:32 AM
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దపల్లి పట్టణం రంగంపల్లి లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పెద్దపల్లిటౌన్/సుల్తానాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దపల్లి పట్టణం రంగంపల్లి లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ వివరాలు, ల్యాబ్ లో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫార్మసి విభాగంలో ఉన్న మందులు, డెంగ్యూ కేసులు, ప్రసవాల సంఖ్య అంశాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో షుగర్ పరీక్షించేందుకు గ్లుకో మీటర్ మంజూరు చేస్తామన్నారు.
ఎన్‌సిడి రోగులకు ప్రతీ నెలా మందులు సరఫరా చేయాలన్నారు. గర్రెపల్లి పీహెచ్‌సీలో సీబీపీ మెషిన్ మరమ్మతు మూడు రోజులలో చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు రామకృష్ణ, స్వప్న, సిందూజ, అధికారులు, పాల్గొన్నారు.