రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - May 15 , 2025 | 11:53 PM
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్య ఆరోగ్య సిబ్బందిని సూచించారు. గురువారం జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు.
పెద్దపల్లిటౌన్, మే 15 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్య ఆరోగ్య సిబ్బందిని సూచించారు. గురువారం జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్, ఆయుర్వేద హోమియో సెంటర్, ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ సెంటర్, మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న డెం టల్ సెంటర్, కంటి విభాగం, గర్భిణీల వార్డు, ల్యాబ్, ఆరోగ్య మహిళా కౌం టర్, 2డి ఎకోరూం, వివిధ ఓపి రూమ్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, డయాగ్నొస్టిక్ హబ్ వద్ద అన్ని రకాల వైద్య పరీక్షలు జర గాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ సంఖ్య పెరగాలని, దీనికి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు కూర్చునే విధంగా కుర్చీలు వేయాలని, ఓపి రూమ్ వద్ద సీటింగ్ పెంచాలని సూచిం చారు. ఆసుపత్రిలో రోగుల వీలుగా రెండు మూడు ప్రదేశాలలో టీవీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్‌ఎంవో డాక్టర్ విజయ్ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.