Share News

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:31 PM

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పై దాడిని ఖండిస్తూ, కుల వివక్ష కారణంగా ఐపీఎస్‌ అధికారి పూరన్‌కుమార్‌ ఆత్మహత్యకు కారణ మైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం నిరసన తెలిపారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మంథని, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పై దాడిని ఖండిస్తూ, కుల వివక్ష కారణంగా ఐపీఎస్‌ అధికారి పూరన్‌కుమార్‌ ఆత్మహత్యకు కారణ మైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం నిరసన తెలిపారు. బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్‌ మాట్లాడుతూ.. దేశంలో అత్యున్నత స్థాయిల్లో ఉన్న వారు సైతం కుల వివక్షతకు గురికావడం దారుణమన్నారు.

ఈ రెండు సంఘటనలను అందరూ ఖండించాలని కోరారు. తెలంగాణలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఈనెల 14న బీసీ సంఘాలు ఇచ్చిన బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు ఆరెపల్లి కుమార్‌, వేల్పుల గట్టయ్య, దేవళ్ళ విజయ్‌కుమార్‌, పీక మల్లేశం, రాదండి శంకర్‌, లింగయ్య, రవి, తిరుపతి, శ్రీకాంత్‌, ధర్మేందర్‌, శ్రావణ్‌, రాజపోషంలు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:31 PM