Share News

బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:34 PM

మండలంలోని కిష్టంపేట, మీర్జంపేట గ్రామాల రహదారిపై ఆదివారం బీజేపీ నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి గుంతలమయంగా మారిందని వారు విమర్శించారు.

బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన

కాల్వశ్రీరాంపూర్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని కిష్టంపేట, మీర్జంపేట గ్రామాల రహదారిపై ఆదివారం బీజేపీ నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి గుంతలమయంగా మారిందని వారు విమర్శించారు. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వర్షాలు పడటంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారిందన్నారు. నాయకులకు పట్టింపు లేదని, అందుకే వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్నామన్నారు.

ఆర్టీసీ బస్సులు రావడం లేదని, విద్యార్థులకు, గ్రామస్థులకు ఇబ్బందిగా మారిందని, ఈ రహదారి మీదుగా మంథని నుంచి జమ్మికుంటకు, వరంగల్‌ ప్రధాన రహదారిగా ఉందన్నారు. వెంటనే స్పందించి తక్షణమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నూతన రహదారి వేయాలని బీజేపీ నాయకులు గూడుపు జనార్దన్‌ రెడ్డి, రావుల రాజకుమార్‌ డిమాండ్‌ చేశారు. పంజాల సతీష్‌, గొర్రె ఉదయ్‌ కిరణ్‌ యాదవ్‌, గోపి, శ్రీకాంత్‌, కుర్మా, ఉయ్యాల చంద్రం గౌడ్‌, ఉయ్యాల నరేష్‌ గౌడ్‌, ఆళ్ల తిరుపతిరెడ్డి, ఖడ్గం సాయిచంద్‌, గట్టు శివరాం, కొడదల అనిల్‌, దేశిని నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:34 PM