Share News

దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసన

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:48 PM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దారి మైసమ్మల గుళ్లను కూల్చి వేయడంపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖని చౌరస్తాలోని పోచమ్మ గుడి వద్ద సమావేశమై చర్చించారు.

దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసన

కోల్‌సిటీ, నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దారి మైసమ్మల గుళ్లను కూల్చి వేయడంపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖని చౌరస్తాలోని పోచమ్మ గుడి వద్ద సమావేశమై చర్చించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, కుల సం ఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన కార్యక్రమానికి కార్యాచరణ ప్రకటిం చారు. హిందు ఐక్యవేదిక నాయకు లు కొండపర్తి సంజీవ్‌, కోమళ్ల మహేష్‌ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కమిషనర్‌పై చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ రావాలని నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ రహదా రికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఆలయా లకు చెందిన బాధ్యులతో చర్చిం చాలని సుప్రీంకోర్టు పేర్కొందని, రోడ్డుకు అడ్డుగా ఉందంటూ కార్పొ రేషన్‌ అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేశారని ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు.

కలెక్టర్‌ స్పందించడం లేదంటూ రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వ హించారు. ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డిలు ఆం దోళనకారులతో మాట్లాడారు. ఏసీపీ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమ స్యను వివరించారు. కలెక్టర్‌ ఆందోళ నకారులతో మాట్లాడారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తా మని కలెక్టర్‌ హామీతో వారు ఆం దోళన విరమించారు. అనంతరం పెద్దపల్లికి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నాయ కులు కందుల సంధ్యా రాణి, కౌశిక హరి, మేరుగు హన్మంతుగౌడ్‌, రాం మూర్తిగౌడ్‌, రాసమల్ల జనార్దన్‌, సింహాచలం రత్నాకర్‌, వాసర్ల జోసఫ్‌, బొబ్బిలి సతీష్‌, అంబటి నరేష్‌, వడ్లకొండ రవీందర్‌, ఎంచర్ల మహేష్‌, పొన్నం శశి, బొబ్బిలి సతీష్‌, దొమ్మేటి వాసు, పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:48 PM