Share News

కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:15 PM

సింగరేణి కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సమావేశం గోదావరిఖనిలో జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్‌ అధ్యక్షతన జరిగింది.

కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

గోదావరిఖని, అక్టోబర్‌ 24(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సమావేశం గోదావరిఖనిలో జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, బసంత్‌నగర్‌, గ్రామపంచాయతీ, మున్సిపల్‌, ప్రభుత్వ హాస్పిటల్‌ ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో పాటు స్కీమ్‌ వర్కర్స్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల సం దర్భంలో సీఎం రేవంత్‌రెడ్డి కార్మికవర్గానికి అనేక హామీలను ఇచ్చారని, కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని, పని గంటల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.

కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అవ లంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపుని చ్చారు. ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ అశోక్‌, జిల్లా ఉపాధ్య క్షుడు చిలుక శంకర్‌, జిల్లా నాయకులు బి బుచ్చమ్మ, ఐ రాజేశం, జీ మల్లేశం, ఎడ్ల రవికుమార్‌, ఎస్‌ ప్రసాద్‌, బండ పద్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:15 PM