మంథని మహాలక్ష్మీ అమ్మవారి ఊరేగింపు
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:52 PM
నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా దుర్గాష్టమిని పురస్కరించుకొని మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం ఊరేగించారు. కవ్వం చిలుకుతూ గీతాలపనకు అనుగుణంగా పలువురు దంపతులు నృత్యాలతో కన్నుల పండువగా సాగింది.
మంథని, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా దుర్గాష్టమిని పురస్కరించుకొని మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం ఊరేగించారు. కవ్వం చిలుకుతూ గీతాలపనకు అనుగుణంగా పలువురు దంపతులు నృత్యాలతో కన్నుల పండువగా సాగింది.
గోపాల కాలువల్లో భాగంగా మహాలక్ష్మి ఉత్సవ విగ్ర హాన్ని ఊరేగింపు సందర్భంగా స్థానిక మందాట, పెంజేరు కట్ట, తమ్మి చెరువుకట్ట, లక్ష్మినారాయణస్వామి, మహాలక్ష్మి ఆలయాల వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమానికి తిలకించేందుకు భక్తులు తరలి వచ్చారు. లక్ష్మినారాయణస్వామి ఆలయంలోని దుర్గామా త వద్ద నిర్వాహకులు, దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.