రైల్వే గేట్ తో ఇబ్బందులు
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:51 PM
సుల్తానాబాద్ రైల్యే గేట్ తరుచు మూసి ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. సుల్తానాబాద్ రైల్యే గేట్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తరుచూ గేట్లు వేసి ఉండడం వల్ల ప్రయాణి కులు, వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తోంది.
సుల్తానాబాద్, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): సుల్తానాబాద్ రైల్యే గేట్ తరుచు మూసి ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. సుల్తానాబాద్ రైల్యే గేట్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తరుచూ గేట్లు వేసి ఉండడం వల్ల ప్రయాణి కులు, వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా మని ప్రజలు వాపోతున్నారు. సుల్తానాబాద్ పట్టణం మీదుగా రైల్యే గేట్ దాటుతూ ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాలకే కాకుండా హన్మకొండ, వరంగల్, జమ్మికుంట వంటి ప్రధాన పట్టణాలు నగరాలకు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు వందల సంఖ్యలో వెలు తుంటాయి. ఓదెల దేవస్థానం సందర్శనకు ఇదే దారి గుండా ప్రయా ణిస్తారు. సుల్తానాబాద్ ప్రాంతంలో ఉన్న వందలాది రైస్‌మిల్లులు నుంచి బియ్యం లోడ్‌లు రైల్యే గేట్ ఆనుకుని గోదాములకు వద్దకు, సుద్దాల, కదంబాపూర్ గోదాములకు లారీలు వస్తుంటాయి. క్వారీల నుంచి పెద్ద పెద్ద ట్రాలీలతో గ్రానైట్‌ను తరలిస్తుంటారు. రైల్యే ట్రాక్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.