Share News

ప్రైవేట్‌ ఆస్పతులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - May 28 , 2025 | 12:04 AM

ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపించాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. మం గళవారం ఆమె కార్యాలయంలో అడ్వయి జరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 31 స్కా నింగ్‌ కేంద్రాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, వీటిలో ప్రతీ నెల అన్ని కేంద్రాలు తనిఖీ చేస్తున్నామన్నారు.

ప్రైవేట్‌ ఆస్పతులు  నిబంధనలు పాటించాలి

పెద్దపల్లిటౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపించాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. మం గళవారం ఆమె కార్యాలయంలో అడ్వయి జరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 31 స్కా నింగ్‌ కేంద్రాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, వీటిలో ప్రతీ నెల అన్ని కేంద్రాలు తనిఖీ చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా స్కానింగ్‌ మిషన్‌ కలిగి ఉండడం నేర మని, రిజిస్ర్టేషన్‌ లేని స్కానింగ్‌ మిషన్‌ ఉన్న ఆసుపత్రులు ఏమైనా ఉంటే రిజి స్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. లేకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసు కుంటామన్నారు.

గోదావరిఖనిలోని లోటస్‌ స్కాన్‌ కేంద్రం రిన్యూవల్‌, పెద్దపల్లిలోని తిరుమల ఆసుపత్రి న్యూరిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులు వచ్చాయన్నారు. సలహా కమిటీ పరిశీలించి జిల్లా అథారిటీకి సిఫా ర్సు చేసినట్లు తెలిపారు. ఇటీవల తనిఖీ చేసిన స్కానింగ్‌ కేంద్రాలు, తీసుకున్న చర్యలను, ఎదుర్కొన్న విషయాలపై సమీ క్షించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాకేష్‌ చట్టపరమైన సలహాలు ఇచ్చారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టంను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు అడ్వయిజరీ కమిటీ సభ్యులు అభినందిం చారు. వైద్యులు వి.వాణిశ్రీ, స్రవంతి, రవీందర్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:04 AM