Share News

పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:32 AM

వర్షాకాలం నేప థ్యంలో పారిశుధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్‌ పట్టణంలో పర్యటించారు. మార్కండేయ కాలనీ వద్ద పాత ఐసీడీఎస్‌ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న వృద్ధుల ఆశ్రమం పనులను, అనాథ బాలల ఆశ్రమం పనులను, ఐబీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించారు.

పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి

సుల్తానాబాద్‌, జూలై 15: (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేప థ్యంలో పారిశుధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్‌ పట్టణంలో పర్యటించారు. మార్కండేయ కాలనీ వద్ద పాత ఐసీడీఎస్‌ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న వృద్ధుల ఆశ్రమం పనులను, అనాథ బాలల ఆశ్రమం పనులను, ఐబీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై అధికారు లతో సమావేశం నిర్వహించారు.

కలెక్టర్‌ మాట్లాడుతు పట్టణం లో నిర్మాణంలో ఉన్న వృద్ధుల బాలల ఆశ్రమాలను రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆశ్రమాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో అశ్రద్ధ చూపరాదని, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్‌ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రణాళికలను రూపొం దించుకోవాలని, లక్ష్యం మేరకు వనమహోత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న హైస్కూల్‌ వేరే చోటకు తరలించే పనులపై ఆరా తీశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న ల్యాబ్‌ భవనం స్థానంలో నూతనంగా హైస్కూల్‌ భవన సముదా యం నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌ సింగ్‌, పంచా యతీ రాజ్‌ ఈఈ గిరిష్‌ బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:32 AM