డిసెంబరు 9లోగా పీఆర్సీ ప్రకటించాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:45 PM
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9వ తేదీలోగా పీఆర్‌సీ ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంబి గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్‌టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9వ తేదీలోగా పీఆర్‌సీ ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంబి గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్‌టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు పెండింగ్ బిల్లులకు రూ.10 వేల కోట్లను చెల్లించాలని, ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించినట్లు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలన్నారు.
52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటించాలని, లేకుంటే కార్యా చరణ ప్రకటించి, ఉద్యమం మొదలు పెడుతామని హెచ్చరించారు. ఎంప్లాయి హెల్త్‌కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికను 13 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆమోదించారు. రాష్ట్ర సంఘ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ నర్సింహరెడ్డి, పంచాయతీరాజ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు జగన్‌మోహన్ గుప్తా, రాష్ట్ర నాయకులు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర మహిళా అసోసియేట్ వెంకటలక్ష్మి, జిల్లా మాజీ అధ్యక్షుడు మోతూకూరి నారాయణ, పోచయ్య, పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర, మండల నాయకులను జిల్లాశాఖ ఆధ్వర్యంలో సన్మానించారు.