సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:39 PM
సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని సింగరేణి గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతా రామయ్య పేర్కొన్నారు. గురువారం సింగ రేణి ఆర్‌జీ-1 ఏరియా జీడీకే 2ఇంక్లైన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
గోదావరిఖని, జూలై 17(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని సింగరేణి గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతా రామయ్య పేర్కొన్నారు. గురువారం సింగ రేణి ఆర్‌జీ-1 ఏరియా జీడీకే 2ఇంక్లైన్‌లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతిని ధులకు కొందరు జీఎంలు అంటకాగుతూ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేద ని ఆరోపించారు. సింగరేణికి 36వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన తరువాత కార్మికుల సమస్యలపై, సంక్షేమంపై సీఎండీ, డైరెక్టర్(పా) స్థాయి సమావేశాల్లో అంగీకరిం చిన కార్మికుల సమస్యలను అమలు చేయా లని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్‌జీ-1 బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, నాయకులు ఎస్ వెంక ట్‌రెడ్డి, మిట్ట శంకర్, సయ్యద్ సోహేల్, వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, పెద్దెల్లి శంకర్, భక్తి శ్రీనివాస్, ఎల్. రమేశ్, వెంకటేశ్వర్లు, ఏవీఎస్ ప్రకాష్, బుడిమె సమ్మయ్య, కనకరాజు, పర్లపెల్లి రామస్వామి, చంద్రయ్య పాల్గొన్నారు.