13న పోలీస్‌స్టేషన్ల ప్రారంభం
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:56 PM
మండల ప్రజల చిరకాలవాంఛ నెరవేరనున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మం డల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టే షన్‌ను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు.
ఎలిగేడు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజల చిరకాలవాంఛ నెరవేరనున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మం డల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టే షన్‌ను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఎలిగేడు మండలంగా ఏర్పడి 24ఏళ్లు గడిచినా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 13న పోలీస్‌స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణం కోసం దశలవా రీగా చేపడుతామన్నారు. జిల్లా కేంద్రం మహిళ, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల ప్రారంభించుకొని అదేరోజు నుంచి ప్రజలకు సేవ లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అనంతరం నారా యణపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాప నలు చేశారు. ఇంది రమ్మ గృహ లబ్ధిదారులకు భూమిపూజచేసి మంజూరు పత్రాలను అందజే శారు. రెండు మురికి కాలువలకు రూ.10లక్షలు, రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.13లక్షలు వెచ్చించి నిర్మిస్తామన్నారు. సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్‌కుమార్, అనిల్‌కుమార్, ఎస్సై సనత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ గోపు విజయ భాస్కర్‌రెడ్డి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, నరహరి సుధాకర్‌రెడ్డి, కాసర్ల మహేందర్, తాటిపల్లి రమేష్‌బాబు, పల్లెర్ల వెంకటేష్‌గౌడ్, బూర్ల సత్యం, వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.