Share News

కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారు

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:46 PM

రైతుల కన్నీళ్లు తుడి చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ విషం చిమ్ముతున్నదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం సిరిపురం సమీపంలోని సుందిళ్ల బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు.

కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారు

మంథనిరూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతుల కన్నీళ్లు తుడి చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ విషం చిమ్ముతున్నదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం సిరిపురం సమీపంలోని సుందిళ్ల బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపితే కట్టిన వాళ్ళకు పేరు వస్తుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తుంటే మంథని ఎమ్మెల్యే ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడన్నారు.

గోదా వరి నిండుగా ప్రవహిస్తుందని, నీళ్లు వృథాగా పోతుంటే గోదావరి నది కన్నీళ్లు పెట్టుకుంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని చెప్తు న్నారని, కాని సుందిళ్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృథా చేస్తున్నారో జవాబు చెప్పాలన్నారు. కాం గ్రెస్‌ నాయకులు కళ్లు తెరిచి ఇప్పటికైనా వృథాగా పోతున్న గోదావరి నీళ్లను ఉపమోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నీటి నిల్వతో ఈ ప్రాంతంలోని రైతులకు, ప్రజలకు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుం దన్నారు. నాయకులు ఎగోళపు శంకర్‌గౌడ్‌, మాచీ డి రాజుగౌడ్‌, దండె ప్రసాదు, కనవేన శ్రీనివాస్‌, కండె రమేష్‌, మిర్యాల ప్రసాద్‌రావు, కాయితి సమ్మయ్య, బడికెల సది పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:46 PM