నాట్లు వేసి నిరసన
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:23 AM
నాగారం నుంచి గుట్ట పొలా లకు వెళ్లే దారి బురదగా మారడంతో ఆదివారం మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
కమాన్‌పూర్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నాగారం నుంచి గుట్ట పొలా లకు వెళ్లే దారి బురదగా మారడంతో ఆదివారం మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
మండల బీఆర్‌ఎస్ కన్వీనర్ తాటికొండ శంకర్, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, మాజీ వైస్‌ఎంపీపీలు శ్రీనివాస్, కొట్టె భూమయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ తిరుపతి, పెంచికల్‌పేట మాజీ సర్పంచ్ కొండ వెంకటేష్, గ్రామశాఖ అధ్యక్షుడు కొయ్యడ రవి, ఎద్దు రాజయ్య, నాగారం యూత్ అధ్యక్షుడు ఇట్లవేన రవితోపాటు పలువురు పాల్గొన్నారు.