Share News

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:05 AM

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్‌ డి.వేణు, ఇరిగేషన్‌ ఈఈ బలరాం, ఫారెస్ట్‌ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

ముత్తారం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్‌ డి.వేణు, ఇరిగేషన్‌ ఈఈ బలరాం, ఫారెస్ట్‌ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు. జిల్లాలో సుమారు 247 చెరువులను గుర్తించామని, వాటిని కాపాడుతూ, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. చెరువు శిఖం భూములను కాపాడేందుకు, చెరువుకు చేపట్టాల్సిన మరమ్మతు, చేపల పెంపకం, నీటి వసతుల రూపకల్పన, జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ మధుసూదన్‌ రెడ్డి, డీఈ రాజేంద్ర ప్రసాద్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ జగదీష్‌, ఇరిగేషన్‌ ఏఈ సమీయోద్దిన్‌లతోపాటు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, మల్లేష్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:05 AM