Share News

అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా ముందుకు

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:07 AM

రామగుండం అభివృద్ధిపై ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తున్నామని, రాబోయే 30 నుంచి 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభి వృద్ధి పనులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆర్‌టీసీకాలనీ, చంద్రబాబుకాలనీ, కేసీఆర్‌కాలనీ, శారదానగర్‌, ఫైర్‌స్టేషన్‌ ఏరియాల్లో పర్యటించారు.

అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా ముందుకు

కోల్‌సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రామగుండం అభివృద్ధిపై ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తున్నామని, రాబోయే 30 నుంచి 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభి వృద్ధి పనులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆర్‌టీసీకాలనీ, చంద్రబాబుకాలనీ, కేసీఆర్‌కాలనీ, శారదానగర్‌, ఫైర్‌స్టేషన్‌ ఏరియాల్లో పర్యటించారు. ఆర్‌టీసీ కాల నీకి అప్రోచ్‌రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. ఫైర్‌ స్టేషన్‌ రోడ్డు నుంచి శారదానగర్‌ రోడ్డు లింకు రోడ్డును అభివృద్ధి చేస్తామన్నారు. ఫైర్‌స్టేషన్‌ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పేదలకు పక్కా నివా సాలు నిర్మిస్తామన్నారు. లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, మేదరిబస్తీ, ఉల్లి గడ్డల బజార్‌, అడ్డగుంటపల్లి అబ్దుల్‌ కలాం సెంటర్‌లో పర్యటిం చారు. రూ.29.5కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన యూజీడీ, సెంట్రల్‌లైటింగ్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ రోడ్ల పనులను ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకా రం రామగుండం అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రాం తంలో రూ.29.5కోట్లతో 40అడుగుల విస్తీర్ణంతో సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ తీసి వేసి ఇరువైపులా లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు వ్యాపారస్థులు, ప్రజలు సహకరించాలన్నారు. అభివృద్ధి ఓర్వలేక కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతున్నామన్నారు. పలు ప్రభు త్వ విద్యాసంస్థలను పరిశీలించిన ఆయన పాఠశాల నుంచి పీజీ కళాశాలల వరకు సింగరేణి సహకారం ఉండేలా ఆ సంస్థపై ఒత్తిడి చేస్తామన్నారు. ఎస్‌ఈ శివానంద్‌, ఈఈరామన్‌, నాయకులు మ హంకాళి స్వామి, రాజేష్‌, సాంబమూర్తి, ఉమాదేవి ఉన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:07 AM