Share News

పోలీసులకు శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యం

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:36 PM

పోలీస్‌ సిబ్బందికి విధి నిర్వ హణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. మంగళవారం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన నియామవళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసులకు శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యం

కోల్‌సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సిబ్బందికి విధి నిర్వ హణలో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. మంగళవారం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో సిబ్బందికి వ్యక్తిగత భద్రత, స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన నియామవళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతత, సహనం పాటించడం, సహచరుల మధ్య పర స్పర గౌరవం, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.

పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలువాలంటే వ్యక్తిగత స్థాయిలో క్రమశిక్షణ, ప్రవర్తన, ప్రమాణాలు అవసరమన్నారు మానసిక బలాన్ని పెంపొం దించే మార్గదర్శకాలు, సిబ్బంది మధ్య పరస్పర సహకారం, సేవా స్ఫూర్తి, వ్యక్తిగత జీవన శైలిపై అవగాహన కల్పించారు. అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) శ్రీనివాస్‌, సైకాలజిస్ట్‌ శ్రీనివాస్‌, రామగుండం ఎంవీఐ సంతోష్‌ రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేంద్రగౌడ్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమేష్‌, ఆర్‌ఐ దామోదర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:36 PM