Share News

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 04 , 2025 | 11:57 PM

ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు సంబంధిత అధికారు లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

పెద్దపల్లిటౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి అర్జీలను సత్వ రమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు సంబంధిత అధికారు లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పట్టణానికి చెందిన పర్వీన్‌ తన భర్త కుద్భోద్దీన్‌కు ఇటీవలే ప్రమాదంలో కాలు తొలగించారని, కుటుం బ పోషణ కష్టంగా ఉందని, సుల్తానాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ రెసి డెన్షియల్‌ పాఠశాలలో వాచ్‌ఉమన్‌ పోస్ట్‌ ఇప్పించాలని దరఖాస్తు చేసు కొంది. ఈ మేరకు వారధికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్‌ మండలం పోచమ్మ కాలనీకి చెందిన జి.రమేష్‌ దివ్యాంగుల పెన్షన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా డీఆర్‌డీఏ పీడీకి రాశారు. నంది మేడారం గోపాల్‌ రావుపేట గ్రామాలకు చెందిన రైతులు గోలివాడ నుంచి గోపాలరావు పేట వరకు ఉన్న రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయాయని, వాటిని పూర్తి చేయాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్‌కు రాశారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పందిల్ల శివారులో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కంజు కుమార్‌ కబ్జా చేసి సాగు చేసుకుంటున్నాడని మాజీ ఉపసర్పంచ్‌ దాసరి రమేష్‌ సోమవారం ప్రజావాణిలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. గతంలో రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేసినా సదరు భూమి తనదేనంటూ కబ్జా చేశాడని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు

Updated Date - Aug 04 , 2025 | 11:57 PM